పెరిగిన బంగారం ధర
- August 30, 2018
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో పసిడి ధర పెరిగింది. నేటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.120 పెరిగి రూ.31,200కు చేరింది. పండుగల సీజన్ కావడంతో వినియోగదారుల డిమాండ్‌ను చేరుకోవడానికి నగల వ్యాపారుల కొనుగోళ్లు బాగా పెరిగాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా కూడా సానుకూలత ఉందని తెలిపాయి.
నేటి బులియన్ మార్కెట్లో వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా రూ.38,300గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.48శాతం పెరిగి 1206.30డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.24శాతం పెరిగి 14.73డాలర్లుగా ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒక దశలో రూ.70.82కు పడిపోవడంతో దిగుమతుల వ్యయం పెరుగుతోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







