ఇండియాలో కూడా రానున్న 'UBER' ఫ్లయింగ్ క్యాబ్స్
- August 30, 2018
ఇండియా:మీరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు చా ఏంటి ఇంత ట్రాఫిక్ జామ్ అని అనుకున్నారా వెంటనే ఏ ఫ్లైటో వచ్చి మీకు లిఫ్ట్ ఇస్తే బాగుండునని కలలు కన్నారా.... త్వరలో ఇవన్నీ నిజం కాబోతున్నాయి. అవును ఇది అక్షరాలా నిజం. ఎక్కడికైనా త్వరగా వెళ్లాలంటే Uber క్యాబ్ బుక్ చేయడం మీకు అలవాటు ఉండేవాళ్ళు ఇంకా త్వరగా వెళ్లాలంటే మాత్రం ఇక పై Uber ఫ్లయింగ్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఇదంతా జరగడానికి ఎన్నో ఏళ్లు పట్టదు. త్వరలో ఇండియాలో Uber ఫ్లయింగ్ క్యాబ్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి . వచ్చే ఐదేళ్లలో ఈ కల నెరవేరే అవకాశముంది.
ఐదు దేశాలను ఎంపిక చేసింది....
ఫ్లయింగ్ క్యాబ్ సర్వీస్ లాంఛ్ చేయడానికి ఊబెర్ కంపెనీ ఐదు దేశాలను ఎంపిక చేసింది. అందులో ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, ప్రాన్స్, జపాన్ దేశాలు కూడా ఉన్నాయి.
టోక్యోలో జరిగిన "Uber Elevate Asia Pacific"ఎక్స్‌పోలో ఈ ప్రకటన చేసింది ఉబెర్ కంపెనీ. ఇప్పటికే Uber Elevate అమెరికాలోని డల్లాస్, లాస్ ఏంజిల్స్‌ని ఎంపిక చేసింది కంపెనీ. ఎంపిక చేసిన ఐదు దేశాల నుంచి ఒక్కో నగరాన్ని సెలెక్ట్ చేస్తుంది Uber .
Uber ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే మీరు కూర్చున్న చోట ఓ క్లిక్ చేస్తే చాలు ఫ్లైట్ వచ్చి మిమ్మల్ని మీ గమ్యానికి తీసుకెళ్తుంది. ఆసియా పసిఫిక్ నగరాల్లో Uber ఎయిర్ రూట్స్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయో స్థానిక రవాణా వ్యవస్థకు ఎంత ఉపయోగపడ్తాయో కంపెనీ వివరించింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







