ఇరాన్ ఇప్పటికీ అణు ఒప్పందానికి కట్టుబడే వుంది: ఐఎఇఎ
- August 31, 2018
వియన్నా: అమెరికా నేతృత్వంలోని ఆరుదేశాల కూటమితో కుదుర్చుకున్న అణుఒప్పందంలోని నియమ నిబంధనలకు ఇరాన్ ఇప్పటికీ కట్టుబడి వ్యవహరిస్తోందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఎ) స్పష్టం చేసింది. ఈ ఒప్పందం నుండి అమెరికా వైదొలగి, ఇరాన్‌పై ఆంక్షలు పునరుద్ధరించిన తరువాత దీని భవితపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ఐఎఇఎ తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించటం గమనార్హం. ఇరాన్లో అణు కార్యక్రమాలు కొనసాగుతున్న అన్ని ప్రదేశాలను సందర్శించేందుకు తమకు వెసులుబాటు లభించిందని ఐఎఇఎ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే ఈ ప్రాంతాలను పరిశీలించటానికి తమకు సమయానుకూలంగా ఇరాన్ సహకరించటం అత్యంత ప్రధానమని ఐఎఇఎ వ్యాఖ్యానించింది. ఇరాన్లో శుద్ధి చేసిన యురేనియం, భారజల నిల్వలు గత నివేదికలో పేర్కొన్న మొత్తం కంటే కొద్దిగా పెరిగినప్పటికీ ఒప్పందం పరిధిలోనే వున్నాయని వివరించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







