మలేషియాలోని హిందూ గుడికి రంగులేయడంపై ఆగ్రహం

- August 31, 2018 , by Maagulf
మలేషియాలోని హిందూ గుడికి రంగులేయడంపై ఆగ్రహం

మలేషియాలోని బటుకేవ్స్ హిందూ ఆలయ యాజమాన్యంపై ఆ దేశ నేషనల్‌ హెరిటేజ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. 12 ఏళ్లకోసారి జరిగే కార్తికేయ ఉత్సవంలో భాగంగా ఆలయంతో పాటు మెట్లకు ఆకర్షణీయమైన రంగులేశారు. అయితే ఈ ఆలయ విశిష్టతల దృష్ట్యా దీనికి వారసత్వ గుర్తింపు దక్కింది. దీంతో తమ అనుమతి లేకుండా ఆలయానికి రంగులద్దినందుకు ఆలయ కమిటీపై నేషనల్‌ హెరిటేజ్‌ సంస్థ నిప్పులు చెరిగింది. నేషనల్‌ హెరిటేజ్‌ చట్టం-2005కు సంబంధించిన సెక్షన్‌ 40ను ఉల్లంఘించినందుకుగానూ కఠిన చర్యలు తీసుకోవడడానికి రంగం సిద్ధం చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com