అధికారులకు ఓలా, ఉబర్లే గతి
- August 31, 2018
కర్ణాటక ప్రభుత్వం త్వరలో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు ఇకపై ఓలా, ఉబర్ లాంటి టాక్సిల్లో ఆఫీసుకు వచ్చి వెళ్లాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులు ఉపయోగించే ప్రైవేటు కార్ల స్థానంలో ఓలా, ఉబర్ లాంటి యాప్ బేస్డ్ టాక్సీలు వాడుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రైవేటు కార్లతో విపరీతమైన ఖర్చు అవుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు కార్ల స్థానంలో ఓలా, ఉబర్ కార్లను అద్దెకు తీసుకుంటే ఖర్చు చాలా వరకు తగ్గుతుందని భావిస్తున్నారు.
ప్రతి సంవత్సరం అధికారుల ప్రైవేటు కార్ల కోసం సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని పర్సనల్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. అన్ని డిపార్ట్ మెంట్ల అధికారుల కోసం దాదాపు 500 అద్దె కార్లు వినియోగిస్తున్నారు. ఒక్కొక్క కారుకు నెలకు రూ.25,000 అద్దె చెల్లిస్తున్నారు. ప్రతి వాహనం 8 గంటలే షిప్ట్ లో ఉంటుంది. 80 కి.మీ. మాత్రమే తిరుగుతుంది. ఒక వేళ ఎక్కువ సమయం ఉండాల్సి వస్తే... గంటకు రూ.40 అదనంగా చార్జ్ చేస్తారు. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రైవేటు కార్ల స్థానంలో అద్దెకార్లు వాడుకునేవిధంగా ఏర్పాట్లు చేయనుంది. అధికారులను ఇంటి నుంచి తీసుకురావటం, తిరిగి డ్రాప్ చేసి వచ్చే విధంగా ఒప్పందం చేసుకోకున్నారు. త్వరలో దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!