కేరళకు దక్షిణాది తారల విరాళం..

- September 01, 2018 , by Maagulf
కేరళకు దక్షిణాది తారల విరాళం..

పదిరోజులపాటు పాటు ఉప్పొంగిన వరదలకు కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆపదలో ఉన్న కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు వేలాదిమంది ముందుకు వచ్చారు. ఈ క్రమంలో దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో 1980ల నాటి సినీ తారలంతా తమ వంతుగా 40 లక్షల రూపాయల విరాళం అందించారు.

’80’s సౌత్‌ యాక్టర్స్‌ రీ-యూనియన్‌’ పేరుతో కేరళ వరద బాధితుల ఈ భారీ విరాళాన్నిచ్చింది.1980ల నాటి నటీమణులంతా స్పందించి 40 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు.. ఈ చెక్కును శుక్రవారం కేరళ సీఎంను కలిసి అందజేసినట్టు సీనియర్‌ హీరోయిన్‌ సుహాసిని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేశారు. గాడ్స్‌ ఓన్‌ కంట్రీ వాసులు పూర్తిగా కోలుకునేలా తమ వంతు సహాయాన్నందించేందుకు నిర్ణయించామని నటి కుష్బు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com