ఖతార్ కు సౌదీ అరేబియా షాక్...!
- September 01, 2018
రియాద్ : సౌదీ అరేబియా-ఖతార్.. దాదాపు ఏడాది క్రితం ఈ రెండు దేశాలది ఒకేమాట. కానీ అంతర్జాతీయ వేదికలపై ఇరాన్‌కు మద్దతు ఇవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. ఖతార్ ఉగ్రసంస్థలను ప్రోత్సహిస్తోందంటూ సౌదీ ఆరోపించింది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలను తమ విమానాశ్రయాలో ఎట్టిపరిస్థితుల్లో ల్యాండింగ్ అయ్యేందుకు అనుమతించమని సౌదీ అరేబియా వెల్లడించింది. దీంతో, యూఏఈ, ఈజిప్టు, బహ్రెయిన్ సహా పలు అరబ్ దేశాలు ఇదే బాట పట్టాయి. అయినా ఖతార్ లొంగకపోవడంతో ఈసారి సౌదీ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. సౌదీ-ఖతార్ దేశాల మధ్య వివాదం ముదిరింది. ఇరుదేశాలను కలుపుతున్న భూభాగం మధ్యలో కాలువను తవ్వాలని సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రణాళికలు రచిస్తున్నారు. తద్వారా ఇప్పటివరకూ ఒక వైపున భూభాగంతో అనుసంధానమై ద్వీపకల్పంగా ఉన్న ఖతార్‌ను ద్వీపంగా మార్చేసి మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.53,152 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా 60 కిలోమీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో కాలువను తవ్వనున్నారు.
ఈ కాలువలోనే అణు విద్యుత్ కేంద్రాల్లో మిగిలిపోయిన వ్యర్థాలను నిల్వ చేసేందుకు ప్రత్యేకమైన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కాలువ నిర్మాణం కోసం సౌదీ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..