లోఫర్:రివ్యూ
- December 17, 2015
లోఫర్ జానర్: ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తారాగణం: వరుణ్ తేజ్, దిశాపటాని, రేవతి, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరిజగన్నాథ్ నిర్మాత: సివి రావు, శ్వేతాలానా, వరుణ్, తేజ సంగీతం: సునీల్ కశ్యప్ కంచె సినిమాతో ప్రయోగాత్మక చిత్రంతో కూడా మంచి సక్సెస్ సాధించిన వరుణ్ తేజ్, తొలిసారిగా ఓ కమర్షియల్ స్టార్ అనిపించుకునే ప్రయత్నంలో చేసిన సినిమా లోఫర్. టైటిల్ నుంచే అందరినీ ఆకర్షించిన ఈ సినిమా, ట్రైలర్ రిలీజ్ తరువాత మరింత హైప్ క్రియేట్ చేసింది. టెంపర్ సినిమాతో ఈ ఏడాది మంచి సక్సెస్ సాధించిన పూరి జగన్నాథ్ ఆ తరువాత జ్యోతిలక్ష్మి సినిమాతో నిరాశపరిచాడు. ఈ లోఫర్ తో తిరిగి ఫాంలోకి రావాలని తనకు బాగా కలిసొచ్చిన మాస్ హీరోయిజాన్ని నమ్ముకున్నాడు. మరి పూరి దర్శకత్వంలో లోఫర్ గా మారిన వరణ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడా..? తను అనుకున్నట్టుగా కమర్షియల్ హీరో టాగ్ సాధించాడా.. కథ : తాను ప్రేమించిన వ్యక్తితో జీవితం పంచుకోవటం కోసం కోట్ల ఆస్తిని కాదనుకొని వస్తుంది లక్ష్మి (రేవతి). కానీ తను నమ్మి వచ్చిన వ్యక్తి (పోసాని కృష్ణ మురళి) ఓ లోఫర్ అని తెలిసి అతనికిదూరమవ్వాలనుకుంటుంది. తనతో పాటు తన కొడుకును కూడా అతడికి దూరంగా పెంచాలనుకుంటుంది. ఈ లోగా అతను లక్ష్మి కొడుకు రాజా (వరుణ్ తేజ్) ను తీసుకొని జోధ్ పూర్ పారిపోతాడు. ఆ పిల్లాడిని కూడా తన లాగే లోఫర్ లా పెంచుతాడు. తల్లి కామెర్లతో చనిపోయిందని చెప్పి కొడుకును నమ్మిస్తాడు. దొంగతనాలు, మోసాలు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేయాలనకున్న కుటుంబసభ్యుల నుంచి పారిపోయిన పారిజాతం (దిశాపటాని) జోధ్ పూర్‌లో ఉంటున్న తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్తుంది. జోధ్ పూర్‌లో దిగగానే పోసాని కృష్ణమురళి ఆమె సెల్ ఫోన్ కొట్టేస్తాడు. తరువాత రాజా ఆమె బ్యాగ్ కొట్టేస్తాడు. అలా జోధ్ పూర్ లో రెండు మూడు సార్లు కలిసిన రాజా, పారిజాతం ప్రేమలో పడతారు. ఈ విషయాన్ని పారిజాతం తన మేనత్తకు చెబుతుంది. ఈ లోగా పారిజాతం ఉంటున్న ప్లేస్ కనిపెట్టిన ఆమె ఫ్యామిలీ జోధ్ పూర్ వచ్చేస్తారు. వాళ్లు పారిజాతాన్ని తీసుకెళ్లే సమయంలో వరుణ్ ఆమె మేనత్తను చూసి షాక్ అవుతాడు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో రైల్లో వెళుతున్న పారిజాతాన్ని, ఆమె మేనత్తను పారిజాతం ఫ్యామిలీ పట్టుకుంటారు. తరువాత రాజా పారిజాతాన్ని కలిశాడా..? పారిజాతం మేనత్తకి రాజాకి సంబంధం ఏంటి..? చిన్నప్పటి నుంచి తల్లికి దూరంగా పెరిగిన రాజా తల్లిని ఎలా కలిశాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : తొలిసారిగా కమర్షియల్ స్టార్ అనిపించుకునే ప్రయత్నం చేసిన వరుణ్ పర్ఫామెన్స్ లో మంచి పరిణతి కనబరిచాడు. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్ లో బాగా నటించాడు. యాక్షన్ సీక్వన్స్ లతోనూ మాస్ ఆడియన్స్ కు చేరువయ్యే ప్రయత్నం చేశాడు. ఇక సినిమాలో కీలకమైన తల్లి పాత్రలో నటించిన రేవతి, ఆ క్యారెక్టర్ కు తానే బెస్ట్ ఆప్షన్ అని ప్రూవ్ చేసుకుంది. ప్రతీ సీన్ లోనూ తన సీనియారిటీని చూపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంది. రెగ్యులర్ గా తను చేసే తరహా లోఫర్ క్యారెక్టర్ లో కనిపించిన పోసాని పరవాలేదనిపించాడు. కొంత గ్యాప్ తరువాత ముఖేష్ రుషి ఫుల్ లెంగ్త్ విలన్ క్యారెక్టర్ లో మెప్పించాడు. అలీ, బ్రహ్మనందం, సప్తగిరి, ధన్ రాజ్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా తరువాత సెంటిమెంట్ జోలికి వెళ్లని పూరి జగన్నాథ్. లాంగ్ గ్యాప్ తరువాత చేసిన సెంటిమెంట్ సినిమా లోఫర్. దర్శకుడిగా రొటీన్ అనిపించిన పూరి, డైలాగ్ రైటర్ గా మాత్రం ఆకట్టుకున్నాడు. వరుణ్ తేజ్ ని పక్కా కమర్షియల్ స్టార్ గా ప్రజెంట్ చేయటంలో మంచి సక్సెస్ సాధించాడు. సునీల్ కశ్యప్ సంగీతం పర్వాలేదనిపించింది. సువ్వి సువ్వాలమ్మ పాట తప్ప గుర్తుండిపోయే పాటలు లేవు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, హీరో ఇంట్రడక్షన్ సాంగ్, రొమాంటిక్ సాంగ్స్ తో పాటు కోటలో తీసిన ఫైట్స్ సీక్వన్స్ లో కెమరా వర్క్ చాలా బాగుంది. విశ్లేషణ: ఇప్పటివరకు ప్రయోగాత్మక చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్, లోఫర్ సినిమాతో కమర్షియల్ గా స్టార్ మారాడు. అందుకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. వరుణ్ కెరీర్ పరంగా లోఫర్ స్పెషల్ సినిమా అయినా.. పూరి పరంగా మాత్రం ఇది రొటీన్ సినిమానే.. రెగ్యులర్ గా పూరి సినిమాల్లో కనిపించే ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందు వచ్చే ఫైట్ సీన్ పోకిరి సినిమా చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇంకా చాలా సన్నివేశాల్లో పూరి గత చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఈసారి సెంటిమెంట్ ను పండించటంలో కూడా పూరి సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా తల్లి పాత్రకు రేవతి ఎంపిక చేసుకోవటంలోనే పూరి చాలావరకు విజయం సాధించేశాడు. భారీ అంచనాలతో మెగా అభిమానులుగా వెళ్లే ఆడియన్స్ కు కాస్త నిరాశకలిగినా.. పూరి స్టైల్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రం మంచి ఎంటర్ టైన్మెంట్ అందించే సినిమా లోఫర్. ప్లస్ యింట్స్ : రేవతి వరుణ్ యాక్టింగ్ డైలాగ్స్ సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : రొటీన్ టేకింగ్ ఫస్టాఫ్ కామెడీ ఓవరాల్ గా లోఫర్ పూరికి రొటీన్ సినిమా, వరుణ్ తేజ్ కి పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్ టైనర్.
--మాగల్ఫ్.కామ్ రేటింగ్:3
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









