“మా” లో చీలిక..

- September 02, 2018 , by Maagulf
“మా” లో చీలిక..

‘మా’ లో విభేదాలు తారా స్థాయికి చేరాయి. చిరంజీవి ముఖ్య అతిథిగా యుస్ లో నిర్వహించిన కల్చరర్ ప్రోగ్రామ్స్ లో మూడు కోట్ల నిధులు తారు మారు అయ్యాయని ‘మా’ జనరల్ సెక్రటరీ నరేష్ చేసిన అభియోగం పై నిన్న ( శనివారం) రాత్రి అర్ధ రాత్రి వరకూ చర్చలు జరిగాయి. ‘మా’ అసోసియేషన్ చర్చలు అర్ధరాత్రి వరకూ జరగడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడు శివాజీరాజా , జనరల్ సెక్రటరీ కి మద్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో నరేష్ ఈ కార్యవర్గ సమాచారానికి ‘బౌన్సర్స్ ’ తో దిగడం ఈ చర్చల ఏలాంటి వాతావరణం లో జరిగిందో అర్ధం అవుతుంది. ఇప్పుడంతా బాగుంది అసలు ఏం జరగలేదు.. మేమంతా బాగానే ఉన్నాం అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, ఒకరెండ్రు రోజుల్లో ఈ విభేదాలు రోడ్ మీదకు వస్తాయని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com