తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాష్టమి వేడుకలు

- September 02, 2018 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాష్టమి వేడుకలు

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ దుర్గగుడిలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారుర. మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో రాజగోపురం ఎదురుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గగుడి అసిస్టెంట్ ఈవో అచ్యుతరామయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం ఉట్టికొట్టే పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్‌ వద్ద ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన వేడుకల్లో చిన్నారులు చిన్ని కృష్ణులుగా అలరించారు. కృష్ణుడి వేషంలో ఉట్టికొట్టేందుకు పోటీపడ్డారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర జిల్లాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా సాగాయి. పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఈ కృష్ణాష్టమి వేడుకల్లో చిన్నారులు కృష్ణుడి వేషధారణలో అలరిస్తూ పలువురిని ఆకట్టుకున్నారు.

ఆదిలాబాద్‌లో కృష్ణాష్టమి వేడుకలు మొదలయ్యాయి. స్థానిక మురళీకృష్ణ ఆలయం నుంచి భక్తులు భజనలు చేస్తూ ముందుకు సాగారు. శ్రీకృష్ణుడి విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణతో సందడి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com