రేపటి నుంచి ప్రసారం కానున్న బిగ్ బి 'కౌన్ బనేగా కరోడ్ పతి' సీజన్ 10

- September 02, 2018 , by Maagulf
రేపటి నుంచి ప్రసారం కానున్న బిగ్ బి 'కౌన్ బనేగా కరోడ్ పతి' సీజన్ 10

దేశవ్యాప్తంగా పాపులార్టీ సంపాదించుకున్న కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 10 రేపటి నుంచి ప్రసారం కానుంది.. ఈ కార్యక్రమానికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవరిస్తున్నారు.. ఈ కార్యక్రమం ద్వారా సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అయ్యే అవకాశాన్ని దక్కించుకోవచ్చు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడంతో పాటు పార్టిసిపెంట్స్ ఎంపిక కూడా పూర్తి చేశారు.. ఈ సీజన్ 10 గురించి అమితాబ్ మాట్లాడుతూ, ఈ తరం యువత హిందీలో మాట్లాడటాన్ని తగ్గిస్తున్నారని, అయితే భాషపై మరింత ఆసక్తి పెంచేందుకే తాను ఈ షోలో స్పష్టమైన హిందీలో మాట్లాడతానని చెప్పారు..ఈ టి వి షో సోనీ ఎంటర్ టైన్‌మెంట్‌లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతీరోజూ ఈ షోతో అమితాబ్ అలరించనున్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com