దేశం కాని దేశం వెళ్లి.. అప్పు తీర్చలేక తెలంగాణ యువకుడి ఆత్మహత్య
- September 02, 2018
తెలంగాణ:ఉపాధికోసం దేశం కానీ దేశం గల్ఫ్ వెళ్లి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన శుక్రవారం జరిగింది.రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన చెన్నమేని అంజయ్య–ఎల్లవ్వ దంపతుల ఏకైక కుమారుడు సతీశ్(30), కుమార్తె ఉన్నారు. గతంలో రెండుసార్లు అంజయ్య, సతీష్ గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చారు. అయితే గత కొంతకాలంనుంచి అప్పులు బాధ భరించలేక సతమతమవుతున్నారు తండ్రీకొడుకులు. ఈ క్రమంలో అప్పుచేసి ఆరునెలల క్రితం సతీశ్ బహ్రెయిన్ వెళ్లగా, తండ్రి ఖతార్ వెళ్లాడు. అయితే ఇద్దరికి తక్కువ రాబడితో ఇబ్బంది పడుతున్నారు. ఈ చాలిచాలని వేతనాలతో అప్పులు ఎలా తీర్చాలో అని సతీష్ తన భార్యతో చెప్పుకుని మధనపడేవాడు. అయితే శుక్రవారం రాత్రి సతీష్ కు తల్లి, భార్య రాజ మణి, వీడియో కాల్ చేశారు ఇద్దరు కొడుకులు చూస్తుండగానే గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. వారు వద్దని ఎంత వారించినా వినకుండా వారి కళ్లెదుటే ఆత్మహత్య చేసుకున్నాడు సతీశ్. దీంతో ఎలా కాపాడాలో తెలియక కుటుంబసభ్యులు రోదిస్తూ ఉండిపోయారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







