సల్మాన్,వెంకీల మల్టీస్టారర్ సినిమా..
- September 03, 2018
ప్రస్తుతం మల్టీస్టారర్ హావ మొదలు అయ్యింది..తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లోను మల్టీస్టారర్ చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఇక తెలుగులో సీనియర్ హీరో వెంకటేష్ ఈ చిత్రాలపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నాడు. ఇప్పటికే నాగ చైతన్య తో వెంకిమామ , వరుణ్ తేజ్ తో ఎఫ్ 2 చిత్రాల్లో నటిస్తున్నాడు.
తాజాగా మరో క్రేజీ మల్టిస్టారర్ చిత్రానికి వెంకీ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈసారి తమిళ్ హీరోతో చేస్తుండడం విశేషం.
మహానటి చిత్రం తో తెలుగు ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకున్న తమిళ్ నటుడు దుల్కర్ సల్మాన్ తో నటించడానికి వెంకీ ఒప్పుకున్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరు , నటి నటులెవరు..నిర్మాత ఎవరు అనేది త్వరలో తెలియనున్నాయట. మూడు రోజుల క్రితం తమిళ్ హీరో సూర్య తో కూడా వెంకీ ఓ సినిమా చేస్తున్నట్లు, డి సురేష్ బాబు నిర్మించబోతున్న ఈ సినిమాకు సినిమా చూపిస్తా మావ ఫేమ్ త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించబోతున్నాడనే వార్తలు వినిపించాయి. మరి ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో ఏది నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







