ఈద్‌ సెలవులు: 10 షాపుల్లో దోపిడీ

- September 03, 2018 , by Maagulf
ఈద్‌ సెలవులు: 10 షాపుల్లో దోపిడీ

మస్కట్‌: ఈద్‌ అల్‌ అదా సెలవుల సందర్భంగా 10 దుకాణాల్లో దోపిడీ జరిగింది. ఈ కేసులకు సంబంధించి ముగ్గురు అనుమానితుల్ని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ - మస్కట్‌ పోలీస్‌ అమెరాత్‌ ప్రావిన్స్‌లో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. అరెస్టయినవారు ఈద్‌ అల్‌ అదా సెలవుల సమయంలో 10 షాపుల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు పోలీసులు. అరెస్ట్‌ చేసినవారిని తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్‌ అథారిటీస్‌కి అప్పగించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com