బస్తీ మే సవాల్
- September 03, 2018
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో నెలల తరబడి మగ్గుతోన్న విభేదాలు భగ్గుమన్నాయి. సిల్వర్ జూబ్లీ సందర్భంగా లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని నరేష్ చేసిన ఆరోపణలు సినిమా వర్గాల్ల సంచలనం సృష్టించాయి. దీంతో ఈ విషయంపై ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, ఈసి మెంబర్ శ్రీకాంత్ లతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. తానే తప్పూ చేయలేదని.. మా డబ్బులు ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదని చెప్పాడు. తను అవినీతికి పాల్పడ్డట్టు నిరూపిస్తే తన ఆస్తంతా అమ్మి ‘మా’కే ఇస్తానని చెప్పాడు. కొందరు ‘మా’ అధ్యక్ష పదవి కోసం ఇలా డ్రామాలాడుతున్నారని ఆరోపణలు చేసిన వ్యక్తులను ఉద్దేశిస్తూ చెప్పాడు.
శివాజీరాజా ప్రెస్ మీట్ కు కౌంటర్ ఇస్తూ ‘మా’ జనరల్ సెక్రటరీ సీనియర్ నటుడు నరేష్ మరో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా నరేష్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే చూద్దాం.
‘‘మా అధ్యక్షుడు శివాజీరాజా నిర్ణయాలు ఆశ్చర్యం అనిపించాయి.. నాతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే నిర్ణయాలు తీసుకున్నారు. పెద్దలు వస్తున్నారనీ, శివాజీరాజాపై నమ్మకంతో ఒప్పందాలపై సంతకం చేశాను. ఎవరి మీద ఫిర్యాదు చేయడం లేదు, తప్పు చెప్పడం లేదు.. రజతోత్సవాలకు సంబంధించి జనరల్ సెక్రటరీగా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 2017 నుంచి శివాజీరాజాతో ఫోన్ కాల్స్ వివరాలను బయటపెట్టాను. నా కాల్ బ్లాక్ చేశారు. అసోసియేషన్ డబ్బులతో అమెరికాకు అందరూ బిజినెస్ క్లాస్ లో వెళ్లారు. మా రజతోత్సవానికి సంబంధించిన లావాదేవీలు నాకు తెలియకుండా జరిగాయి. మా వేడుకల కోసం మహేశ్ ను కూడా ఒప్పించాను. మా అసోసియేషన్ లో 6 నెలల కిందట మినట్ బుక్స్ లో కార్యాలయం నేను ఆధీనంలోకి తీసుకుంటున్నానని రాశా. మా అసోసియేషన్ రికార్డుల్లో నమోదైన వివరాలు మాయమయ్యాయి. ఈసీ మీటింగ్ లో నాపట్ల, మీడియా పట్ల దుర్భాషలాడారు. ఇంటిగుట్టు రట్టు కావద్దని ఇన్నాళ్లు గౌరవంగా ఉన్నా.. మా అసోసియేషన్ ఎన్నికలకు ఖచ్చితంగా వెళ్తాం. మా అసోసియేషన్ లో 6 నెలల కిందట మినట్ బుక్స్ లో నేను ఆఫీస్ ను ఆధీనంలోకి తీసుకుంటున్నానని రాశా. మా అసోసియేషన్ రికార్డుల్లో నమోదైన వివరాలు మాయమయ్యాయి అన్నారు” నరేష్..
ఈసీ మీటింగ్ లో నాపట్ల, మీడియా పట్ల దుర్భాషలాడారు.. అంటూ శివాజీరాజాకు కౌంటర్ ఇచ్చాడు నరేష్. మరి ఈ గొడవ ఎప్పుడు ఎలా సమసిపోతుందో చూడాలి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి