ఇండియా:రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్ ధరలు..
- September 03, 2018
రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారాయి. పెట్రో భారం పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపుతూ ఉండటంతో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పెట్రో ఉత్పత్తుల పెరుగుదల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాలు పెరుగుతుంటే .. సామాన్యుల నడ్డి విరుగుతోంది. తాజాగా చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రస్తుతం పెట్రోల్ , డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. పెట్రోల్ పై రూ.2 , డీజిల్ పై.. రూ.2.42 ధరలు పెరిగాయి. దేశంలోనే ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర తొంబైకి చేరువై.. సెంచరీకి దగ్గరలో ఉంది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల వల్ల సరఫరా తగ్గుతుందన్న భయంతో చమురు ధరలు 15 రోజుల్లో 7 డాలర్లు పెరిగాయి. రూపాయి పతనం వల్ల సీఎన్జీ, పీఎన్జీ ధరలూ పెరిగాయి. కేజీ సీఎన్జీ 63 పైసలు, పీఎన్జీ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు రూ.1.11 పెరిగింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







