'ఫసక్' మీమ్స్ పై మోహన్ బాబు కామెంట్!
- September 03, 2018
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో వాడిన 'ఫసక్' అనే డైలాగ్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ పదంపై రకరకాల మీమ్స్ చేస్తూ మోహన్ బాబు కొత్త పదం కనిపెట్టారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల మంచు లక్ష్మితో కలిసి ఇండియా టుడే కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు మోహన్ బాబు. ఈ క్రమంలో 'ఎం ధర్మరాజు ఎంఏ' సినిమాలో ఓ డైలాగ్ ను తనదైన స్టయిల్ లో పవర్ ఫుల్ గా ఇంగ్లీష్ లో చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ సమయంలో ఫసక్ అనే పదాన్ని వాడారు. ఆయన నోటి నుండి ఎప్పుడైతే ఈ పదం బయటకి వచ్చిందో.. అప్పటినుండి సోషల్ మీడియాలో ఈ పదంపై ఫన్నీ వీడియోలు, మీమ్స్ వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించారు మోహన్ బాబు. తనపై చేస్తోన్న ఈ ట్రోలింగ్ పై మోహన్ బాబు చాలా కూల్ గా స్పందించడం ఆశ్చర్యపరిచింది. ''ఫసక్ అనే పదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందని తెలిసి బాగా అనిపించింది.
ఈ పదంపై దాదాపు 200 ఫన్నీ వీడియోలు వచ్చినట్లుగా విష్ణు చెప్పాడు. అందులో కొన్ని చూశాను. చాలా ఫన్నీగా ఉన్నాయి'' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. మరి మోహన్ బాబు ఇలా కూల్ గా స్పందించారు కాబట్టి ఈ వీడియోల నంబర్ పెరుగుతుందే కానీ తగ్గదనే చెప్పాలి!
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







