'బ్లూవేల్‌'కు బలైన ఇంజనీర్‌

- September 05, 2018 , by Maagulf
'బ్లూవేల్‌'కు బలైన ఇంజనీర్‌

ప్రపంచాన్ని భయపెట్టిన బ్లూవేల్ గేమ్‌కు మరొకరు బలయ్యారు. ఈ ఆట ఆటాడిన ఇంజినీర్‌ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని కడలూరు పన్రూట్టిలోని అంగుచెట్టిపాళయానికి చెందిన శేషాద్రి (22) ఇంజినీరింగ్‌ పూర్తి చేసి పుదుచ్చేరి మెట్టుపాళయంలోని ఓ ప్రవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి యథావిధిగా విధులు ముగించుకుని ఇంటికొచ్చిన శేషాద్రి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పుదుపేట పోలీసులు శేషాద్రి ఇంటికి చేరుకుని అతని గదిని పరిశీలించగా దెయ్యాల కథల పుస్తకాలు కనిపించాయి. శేషాద్రి సెల్‌ఫోన్‌ను చూసిన పోలీసులు బ్లూవేల్‌ గేమ్‌ ఆడినట్టు గుర్తించారు. బ్లూవేల్ గేమ్‌లో మానసిక ఒత్తిడి కారణంగానే శేషాద్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com