రాజమౌళి తనయుడి నిశ్చితార్థం
- September 05, 2018

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. జగపతి బాబు అన్న వీరమాచినేని రామ్ ప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్ తో రాజమౌళి కొడుకు కార్తికేయ నిశ్చతార్ధం జరిగింది. భక్తిగీతాలు ఆలపించే గాయని పూజా ప్రసాద్‌తో కార్తికేయ ప్రేమలో ఉండగా.. వీరిద్దరి పెళ్లికి ఇరు వర్గాలు ఒప్పుకోవడంతో నిశ్చితార్థం చేశారు. రాజమౌళి ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఈ ఏడాది చివరిలో వీరిద్దరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా పూజా.. ప్రముఖ నిర్మాత 'జగపతి' రాజేంద్రప్రసాద్ పెద్ద కుమారుడు రాంప్రసాద్ కుమార్తె. నటుడు జగపతిబాబుకు రాంప్రసాద్ సోదరుడు అవుతారు. ఇదిలా ఉంటే రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌గా చేయడంతో పాటు పలు చిత్రాలకు లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన కార్తికేయ.. ప్రస్తుతం వివిధ రంగాల్లో తన ప్రతిభను కనబరుస్తున్నాడు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







