రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కార్మికుడు
- September 06, 2018
ఢిల్లీ:కోటీశ్వరులం కావాలంటే ఎంతో కష్టపడి పని చేసి సంపాదిస్తే కానీ కాలేం. అహర్నిశలు కష్టపాడాలి. కానీ ఓ కార్మికుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అప్పు చేసిమరీ తన అదృష్టం పరీక్షించుకున్నాడు. రూ.200 పెట్టి లాటరీ టికెట్ కొన్న అతడికి ఏకంగా 1.5 కోట్ల రూపాయల జాక్‌పాట్ తగిలింది. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా వాసి మనోజ్ కుమార్ తొలుత ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. వాస్తవానికి లాటరీ టికెట్ కొనడానికి అవసరమైన రూ.200 కూడా లేకపోవడంతో సహచరుడి దగ్గర అప్పుచేసినట్టు అతడు పేర్కొన్నాడు. తన లాటరీ టికెట్ నెంబర్ విన్నింగ్ నంబర్‌తో సరిపోలడంతో సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. ''అంతా కలలా ఉంది. లాటరీ టికెట్ కొనడానికి నేను అప్పుచేశాను. ఇంత డబ్బు గెలుచుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు..'' అంటూ మనోజ్ సంతోషం వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







