అమెరికాలోని బ్యాంకులో జరిపిన కాల్పుల్లో తెలుగు వ్యక్తి మృతి
- September 06, 2018
న్యూయార్క్ : అమెరికాలోని ఒక బ్యాంక్లో గురువారం ఒక దుండగుడు జరిపిన కాల్పుల ఘటనలో గుంటూరుకు చెందిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సిన్సినాటిలోని ఫౌంటైన్ స్క్వేర్కు సమీపంలోని ఒక బ్యాంకును దోచుకునేందుకు దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఘటనలో గుంటూరు జిల్లాకు చెందిన పృథ్వీరాజ్ కెండెపి (26) మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. పృథ్వీ బ్యాంకులో కన్సల్టెంట్గా పనిచేస్తున్నారని తానా అధికారి పేర్కొన్నారు. లూయిస్ కార్డోలెస్, రిచర్డ్లు ఈ ఘటనలో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం జరిపిన పోలీస్ కాల్పుల్లో దుండగుడు మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, దుండగుడు గతంలో అదే బ్యాంకులో పనిచేశాడని వారు తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







