మెక్సికో:166 మందిని చంపి పాతిపెట్టిన కిరాతకులు
- September 07, 2018
మెక్సికో:తమ అకృత్యాలకు, అక్రమ దందాకు అడ్డొచ్చిన ఎంతమందిని అయినా చంపి వేయడం మనం ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం. అచ్చం అలాంటి సంఘటనే నిజ జీవితంలో జరిగింది. తూర్పు మెక్సికోలోని వెరక్రూజ్ ప్రాంతంలో 166 మంది పౌరుల మృతదేహాలను పోలీసులు గుర్తించడం దేశంలో సంచలనం సృష్టించింది.
వీరంతా ఎవరు..? ఇంతమందిని ఎవరు చంపి ఉంటారు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలలో విచ్చలవిడిగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న మాఫియాతో ఇక్కడి ప్రజలు పోరాడుతున్నారు. ఆ ముఠాతో జరిగిన ఘర్షణల్లో 166 మందిని చంపి, పాతిపెట్టి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ఆగస్టు 8న తవ్వకాలు ప్రారంభించిన పోలీసులకు 166 పుర్రెలు, 200 దుస్తులు, 144 ఐడీ కార్డులు లభించాయి. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం రెండేళ్ల క్రితం వారిని చంపి ఉంటారని తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతం ఎక్కడుందో మెక్సికో ప్రభుత్వం ప్రకటించలేదు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!