వినాయక చవితి నాడు 2.0 టీజర్‌(త్రీడీ) విడుదల

- September 07, 2018 , by Maagulf
వినాయక చవితి నాడు 2.0 టీజర్‌(త్రీడీ) విడుదల

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో 2.0 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ క్రేజీ సినిమా టీజర్ సమయం రానే వచ్చింది. ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రకటించాడు. 2.0 టీజర్ (త్రీడీ) ఈ నెల 13న వినాయక చవితి శుభాకాంక్షలతో మీ ముందుకు వస్తుందని ట్వీట్ చేశాడు అక్షయ్. అంతేకాకుండా 2.0లో తన పాత్రకు సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను షేర్ చేశాడు అక్షయ్. దర్శక, నిర్మాత కరణ్‌జోహార్ కూడా ఈ విషయాన్ని చెప్తూ మరో పోస్టర్‌ను పంచుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com