సిరియా పై రష్యా, ఇరాన్, టర్కీ నేతల చర్చలు
- September 07, 2018
టెహరాన్ : సిరియా భవిత్యవంపై రష్యా, ఇరాన్, టర్కీ అధ్యక్షులు చర్చలు జరిపారు. ఏళ్ళ తరబడి సాగుతున్న అంతర్యుద్ధంతో సిరియా కకావికలమైంది. ఈ నేపథ్యంలో సిరియా భవితవ్యాన్ని తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మూడు దేశాల నేతలు చర్చించారు. సిరియా రెబెల్స్ అదుపులోని ఇడిలిబ్ ప్రావిన్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అక్కడ సైనిక దాడి జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. సిరియాలో కొనసాగుతున్న సైనిక సహకారంపై పుతిన్, రౌహని, ఎర్డోగన్‌ల మధ్య ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని భావిస్తున్నారు. సిరియా ఘర్షణలతో నిర్వాసితులైన శరణార్ధులు స్వదేశానికి రావడం, ఘర్షణల సందర్భంగా గల్లంతైన, లేదా ప్రభుత్వం అరెస్టు చేసిన వారి భవితవ్యంపై దర్యాప్తు చేయడానికి కమిటీని ఏర్పాటు చేయడంపై ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







