యూఏఈ ఆమ్నెస్టీ: 25,000 కొత్త వీసాల్ని మంజూరు చేసిన అమెర్ సెంటర్స్
- September 08, 2018
యూఏఈ:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్‌ఎఫ్‌ఎ) - దుబాయ్, 25,000 కొత్త స్పాన్సర్ వీసాల్ని మంజూరు చేయగా, 2,900 రెసిడెన్సీ వీసాల్ని రెన్యూవల్ చేసినట్లు పేర్కొంది. 'ప్రొటెక్ట్ యువర్‌సెల్ఫ్ బై మాడిఫైయింగ్ యువర్ స్టేటస్' పేరుతో ప్రారంభించిన కార్యక్రమం అక్టోబర్ 31న పూర్తి కానున్న దరిమిలా, అమెర్ సెంటర్స్ ఇప్పటికే 32,843 ట్రాన్సాక్షన్స్‌ని పూర్తి చేసింది. ఆగస్ట్ 1న అమ్నెస్టీ ప్రారంభమయ్యింది. జిడిఆర్‌ఎఫ్‌ఎ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, అమెర్ సెంటర్స్ 7,757 రెసిడెన్సీ వయోలేటర్స్‌తో సంబంధమున్న కేసుల్ని ఫినిష్ చేసినట్లు తెలిపారు. 2,344 వీసాల్ని క్యాన్సిల్ చేయగా, 2,916 వీసాల్ని రెన్యూ చేయడంతోపాటు 25,086 కొత్త స్పాన్సర్ వీసాల్ని మంజూరు చేయడం జరిగిందని వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







