బహ్రెయిన్ లో తెలుగు వారి 'భాగవత కథామృతం'
- December 17, 2015
బహ్రెయిన్ లో కన్నుల పండుగగా 'భాగవత కథామృతం' ఇస్కాన్ సంస్థల ఆధ్వర్యం లో ప్రత్యేకముగా తెలుగు వారు అంతా కలసి మొట్ట మొదటి సారిగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమము ఆధ్యంతం భక్తి భావాలు పెంపొందించే విధంగా సంస్కృతీ సాంప్రదాయాలు ప్రజలు కి తెలియపరిచే విధంగా గౌరవ నీయులు పూజ్య శ్రీ సత్య గోపినాద్ దాస్ ప్రభు జి తన ప్రవచనం లో తెలియజేసారు . ఈ కార్యక్రమము లో తెలుగు వారు అంతా కుటుంబ సమేతం గా పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచానాలును మరియు భగవంతుని లీల విశేషాలను కళాపోషకులు ద్వారా తెలుసుకుంటున్నారు. శ్రీ భాగవత కథమృతం ఇంత అధ్భుతంగా జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి చరిత్ర లో నిలిచిపోవాలి అని గౌరవ నీయులు పూజ్య శ్రీ సత్య గోపినాద్ దాస్ ప్రభు జి అన్నారు . ఇంత ఘనంగా కార్యక్రమమును ముందుకు నడిపించినటువంటి శ్రీ గౌరవనీయులు అర్ .వి .రావు గారు ని మోహన్ మురళీధర్ గారిని ఘనంగా సన్మానించారు. పెద్ద మనసు తో ముందుకు వచ్చినందుకు శ్రీ గౌరవ నీయులు హరిబాబు గారు మరియు కమిటి సభ్యులు వారిని అభినందించారు. మా మీడియా ప్రతినిధి వాసుదేవరావు గారు కూడా పాల్గున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గల్ఫ్ లో జరుపుకోవడం ప్రజలు లో మంచి భావాలు పెంపొందుతాయి అని అన్నారు .
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)




తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







