కొండగట్టు వద్ద ఘోర ప్రమాదం

- September 11, 2018 , by Maagulf
కొండగట్టు వద్ద ఘోర ప్రమాదం

కరీంనగర్: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండగట్టుకు వెళ్లి తిరిగివస్తున్న ఆర్టీసీ బస్సు సమీపంలోని ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలో పడింది.

ఈ ప్రమాదంలో 20మంది ప్రయాణికులు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రమాద స్థలిలో గాయపడినవారి అర్ధనాదాలతో హృదయవిదారకంగా మారింది. బస్సు బ్రేకులు ఫెయిలవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే జగిత్యాల, కరీంనగర్ ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనేపోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
జగిత్యాల ఎస్పీ, కలెక్టర్లు ఘటనా స్థలికి బయల్దేరారు. కాగా, డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని డిపో మేనేజర్ చెబుతుండటం గమనార్హం. ఇంకా బస్సులోనే కొందరు చిక్కుకుని ఉన్నారని తెలిపారు. మంగళవారం కావడంతో కొండగట్టుకు భారీగా భక్తులు తరలివచ్చారని చెప్పారు.

అపద్ధర్మ మంత్రి ఈటెల రాజేందర్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com