చెర్రీ @ అజర్‌బైజాన్

- September 11, 2018 , by Maagulf

రామ్‌చరణ్ - బోయపాటి కాంబోలో ఓ ఫిల్మ్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ ఫిల్మ్‌ కోసం యూనిట్ అజర్‌బైజాన్‌కి వెళ్లింది. రష్యా బోర్డర్‌కి మూడు కిలోమీటర్ల దూరంలోవున్న ప్రాంతంలో షూట్ చేస్తోంది. ఆ ప్రాంతంలో తోడేళ్లు, ఎలుగుబంట్లు, చిరుతలు ఎక్కువగా వున్నట్లు సమాచారం.

ఇదిలావుండగా ఎత్తయిన పర్వతాలకు చల్లటి గాలులు ఎక్కువగా వుండడంతో వేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. బీహార్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. చెర్రీ, వివేక్ ఓబెరాయ్, కైరాఅద్వానీ, బోయపాటిలతో కొంతమంది ఫైటర్లు పాల్గొంటున్నారు.
 
ఈ షూట్ తొలుత బీహార్‌కే వెళ్లాలని ప్లాన్ చేసినా, అక్కడ ఎక్కువ ఖర్చు అవుతుందని భావించి, చివరకు అజర్‌బైజాన్‌ వైపు మళ్లింది యూనిట్.
 
మరోవైపు యాక్షన్ సన్నివేశాలను ఓ రేంజ్‌లో బోయపాటి తెరకెక్కిస్తున్నాడని, ఈ విషయంలో చిరు సలహాని ఆయన పక్కనపెట్టినట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com