బహ్రెయిన్‌లో 881 మంది ఇల్లీగల్ ట్యాక్సీ డ్రైవర్ల అరెస్ట్
- September 11, 2018
మనామా: డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ ఆపరేషన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ లెఫ్టినెంట్ కల్నల్ అదెల్ అల్ దోస్సారి మాట్లాడుతూ, వివిధ దేశాలకు చెందిన 881 మంది ఇల్లీగల్ ట్యాక్సీ డ్రైవర్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యల నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించినట్లు చెప్పారు. డిపార్ట్మెంట్, ఈ తరహా ఉల్లంఘనల్ని ఉపేక్షించబోదని, బహ్రెయినీ ట్యాక్సీ డ్రైవర్లకు అండగా వుంటుందని వివరించారాయన. ఉల్లంఘనులకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు క్యాంపెన్స్ని సెక్యూరిటీ డైరెక్టరేట్స్ ఇతర అధికార వర్గాలతో కలిసి నిర్వహించడం జరుగుతుంని అన్నారు. ఇల్లీగల్ ట్యాక్సీ డ్రైవర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోట్ చేయరాదని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







