'ETCA' ఆధ్వర్యంలో 'గల్ఫ్ గళం'

తెలంగాణ:గల్ఫ్ సంక్షేమం పై రాజకీయ పార్టీలు వైఖరికి నిరసనగా గల్ఫ్ గళం పేరుతో ఎమిరేట్స్ తెలంగాణ  సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం (ETCA)ఆధ్వర్యంలో  తేదీ 11/09/2018  మంగళవారం రోజున సమావేశం నిర్వహించడం జరిగింది.

మొదటగా కొండగట్టు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బిడ్డల ఆత్మలు శాంతించాలని  2 నిమషాలు మౌనం ప్రకటించి నివాళులు అర్పించారు. 

కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాద్ జిల్లాల నుండి కార్మికులు , వివిధ దేశాలలో ప్రవాసీయుల సంక్షేమం  కోసం పనిచేస్తున్న సంఘాల ప్రతినిధులు సుమారు వంద మంది పాల్గొని గల్ఫ్ బిడ్డల డిమాండ్స్ వినిపించడం జరిగింది. 

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన  వ్యవస్థాపక అద్యక్ష్యులు పీచర కిరణ్ కుమార్ మాట్లాడుతూ గల్ఫ్ సంక్షేమం దీర్ఘకాలికంగా ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న గల్ఫ్ బిడ్డలు తీవ్ర ఆందోళనతో వున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు అంశాన్ని నిర్లక్ష్యం చేసిన ఎన్నో పోరాటాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో తెరాస ప్రభుత్వం చేస్తున్న ఆశతో నాలుగున్నర సంవత్సరాలు కళ్ళలో దీపాలు పెట్టుకొని ఎదురుచూశామని కాని ప్రభుత్వం గల్ఫ్ బిడ్డలకు భరోసా కల్పించటంలో విఫలమైందని ఆవేదనతో బాధను వ్యక్తపర్చారు , తెలంగాణ ఉద్యమంలో గల్ఫ్ దేశాలనుండి బిడ్డలు చురుకైన పాత్ర పోషించారని , సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకై సైనికులుగా పనిచేస్తూ, ఆపదలో ఉన్న తెలంగాణ బిడ్డలను కొలువులు చేస్తూ ఎన్నో సహాయ సేవ కార్యక్రమాలు చేస్తూనే కెసిఆర్ న్యాయకత్వాన్ని బలపర్చామని గత ఎన్నికల్లలో సైతం తెరాసకు ఓట్లు వేసి గల్ఫ్ వలస ప్రభావిత ప్రాంత నియోజకవర్గాల అభ్యర్థుల విజయానికి కృషి చేశామన్నారు , అనేక సందర్భాలలో గల్ఫ్ సమస్యలపై నివేదికలు ఇచ్చామని , విజ్ఞప్తులు చేశామని , సమస్య తీవ్రతను ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్లడానికి గల్ఫ్ సంఘాలు కృషి చేశామన్నారు ఆయా ఫలితంగా రాష్ట్ర ఎన్నారై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ప్రభుత్వం ప్రపంచంలోని అన్ని తెలంగాణ సంఘాలను ఆహ్వానించి మా  సలహాలు సూచనలతో ఎన్నారై పాలసీ ముసాయిదాను తయారు చేసి ప్రవాసీ సంక్షేమం కోసం విప్లవాత్మకమైన చర్యలు చేపడుతామని పత్రిక , మీడియా ప్రతినిధుల సమక్షంలో ప్రకటన చేసిన నేటికి అమలుపర్చలేక పోవడం గల్ఫ్ బిడ్డల మనస్సును కలిచివేసిందని , ముఖ్యమంత్రి కూడా ఒక సందర్భంలో కేశవరావు నాయకత్వాన , కేటీఆర్ , కవిత పర్యవేక్షణలో అధ్యయనం చేస్తున్నామని అన్నారని గుర్తు చేశారు. 
రోజు రోజు కి అన్ని గల్ఫ్ దేశాల్లో అంశం ఉద్యమ రూపంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న రాజకీయనాయకులు గల్ఫ్ బిడ్డలను చిన్న చూపు చూస్తున్నారని వాటి అన్నిటి విశ్లేషణల తరువాత ఇక గల్ఫ్ దేశాలలో ఉన్న సంఘాలను , కార్మికులను ఏకత్రాటి పైకి తీసుకొచ్చి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని గల్ఫ్ బలాన్ని స్వంత గడ్డలో పోరాటం చేస్తామని తెలిపారు , ఏ రాజకీయ పార్టీల మ్యానిపెస్టోలను , మాటలను నమ్మము అని గల్ఫ్ సంక్షేమం పై పని చేస్తున్న ప్రతినిధుల సమక్షంలో చర్చలు జరిపి సుస్పష్టమైన భరోసాను కలిపిస్తేనే ఎన్నికల్లో ఓట్లు వేస్తామని స్పష్టం చేసారు.


గత మూడు  మాసాల క్రితం బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించామని అందులో నుండి 50 కోట్ల రూపాయలు ప్రవాసీ సంక్షేమం కోసం వెచ్చిస్తామని చెప్పారని దానిపై కూడ ఒక స్పష్టతో కూడిన అధికారిక ప్రకటన చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసారు. 

ప్రాక్సి ఓటింగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం లోకసభలో బిల్లును ఆమోదించడం శుభపరిణామని రాజ్యసభలో ఆమోదం పొందిన తరువాత గల్ఫ్ బిడ్డల ప్రాధాన్యం రాజకీయ పార్టీలకు తెలుస్తుందని దాని కోసం గల్ఫ్ సంఘాల , కార్మికుల ఐక్యత కోసం కృషి చేసి ఆమోదయోగ్యమైన డిమాండ్ ను పార్టీల పై ఒత్తిడి తీసుకవచ్చి పాలసీ అమలుకు పాటుపడడం మా ముందున్న లక్ష్యమని హాజరయిన బిడ్డలు ప్రతిపాదించారు.

సమావేశానికి హాజరైన ఖతార్ తెలంగాణ సమితి అద్యక్ష్యుడు గూగిళ్ళ రవి గౌడ్ మాట్లాడుతూ గల్ఫ్ సంక్షేమం కోసం పనిచేస్తున్న సంఘాలను ,నాయకులను మరొక సమావేశానికి ఆహ్వానించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని , సంఘాలుగా ఎవరికి వారికి సిద్ధాంతులు ఉన్న , అభిమాన నాయకులు , పార్టీలను పక్కన పెట్టి గల్ఫ్ సంక్షేమం కోసం ఎన్నారై పాలసీ సాధనే ధ్యేయంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు , ఊరూరా ఉద్యమాన్ని వ్యాప్తి చేసి గల్ఫ్ బిడ్డలు ఎక్కువగా వలస వెళ్లే ఉత్తర తెలంగాణలోని యాబై గ్రామాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తామని తెలిపారు.


కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు ఓటములను తారుమారు చేసే శక్తిని రాజకీయ పార్టీలు గుర్తించే టట్టు కార్యాచరణ ఉంటుందని ఒక వేల పార్టీలు స్పందించని యెడల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి కూడ గల్ఫ్ బిడ్డలు వెనుకాడరని తెలిపారు.

కార్యక్రమానికి హాజరయిన గల్ఫ్ సంక్షేమం కోసం పని చేస్తున్న ఎల్లలా శ్రీనన్న సేవ సమితి ప్రతినిధి బాబు స్వామి మాట్లాడుతూ గల్ఫ్ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవద్దని , పార్టీలను ప్రభుత్వాలను గొంతెమ్మ కోరికలు కోరడం లేదని ఆపదలో ఉన్న గల్ఫ్ బిడ్డలను ఆదుకోవాలని మాత్రమే మా ఆవేదన అని ఈ కార్యక్రమానికి సైనికులుగా పనిచేసి గల్ఫ్ గళాన్ని వినిపించడానికి సామాజిక మాధ్యమాల ద్వార ప్రచారం చేస్తూ గల్ఫ్ అన్నల ఐక్యతకు ప్రత్యక్షంగా స్వాంతగడ్డలో కృషిచేస్తామని సంఘీభావం తెలిపారు.
గల్ఫ్ సమస్యలపై 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న సామాజిక సేవకుడు గాంధారి సత్యనారాయణ గారు మాట్లాడుతూ త్వరలోనే గల్ఫ్ కుటుంబాల పదివేల సమ్మేళనంతో గల్ఫ్ గర్జన కార్యక్రమం నిర్వహించి గల్ఫ్ సంఘాలను , సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న ప్రతినిధులను ఆహ్వానిస్తామని మరియు ఇప్పటికే గల్ఫ్ లోని వివిధ దేశాల్లో నివసిస్తున్న కార్మికుల సమాచారాన్ని సేకరిస్తున్నామని , బల్క్ ఎస్సామస్ సర్వీస్ ద్వార ఎప్పటికప్పుడు కార్యక్రమాలను చేరవేస్తూ , అన్ని సంఘాల దగ్గరున్న వివరాలను క్రోడీకరించి నెల రోజుల్లోనే లక్ష మంది గల్ఫ్ బిడ్డల సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు.
గల్ఫ్ కళాకారుల బృందం ప్రతినిధి పడాల లింగారెడ్డి మాట్లాడుతూ కార్యక్రమానికి సంఘీభావంగా వచ్చిన ప్రముఖ కళాకారులు ఆకునూరి దేవన్న , అష్ట గంగాధర్, గుఱ్ఱపు రాము కు కృతజ్ఞతలు తెలిపారు ఇంకా అనేక కళాకారుల సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాల ద్వార , పాటలు , ప్రెసెంటేషన్స్ ద్వార గల్ఫ్ గళాన్ని వినిపించడమే లక్ష్యంగా పని చేస్తామని వందల గల్ఫ్ కళాకారుల సహకారాన్ని కోరుతామని తెలిపారు.

దుబాయ్ ETCA చారిటీ కోఆర్డినేటర్ షేఖ్ అహ్మద్ షాదుల్లా మాట్లాడుతూ కెసిఆర్  నాయకత్వాన్ని ప్రతి వేదిక మీద బలపర్చాము , మా సంఘాలకు కేసీఆర్ అని పాస్వర్డ్స్ పెట్టుకున్నాం , అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాం ,  కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చిన ఎన్ని చట్టాలు ఉన్న దుబాయ్ లో మానవహారాలు, వంట వార్పులు , ధూమ్ ధాములు , వేల మందితో కార్యక్రమాలు వాటికి అతిథులుగా నాయకులను పిలిచి మన నాయకుడు చేస్తాడు ఓపిక పట్టండని నచ్చ చెప్పాము , ప్రత్యక్షంగా వచ్చి కిరణ్ అన్న నాయకత్వంలో పాల్గొన్నాము అని అన్నారు.

ఇప్పుడు మీరు 426 ప్రగతి అంశాలతో ప్రజలారా ఆశీర్వదించండి  అన్న నినాదంతో ఎన్నికల్లోకి వెళుతున్నారు మీ ఆశీర్వాదం  గల్ఫ్ బిడ్డల పైన ఉండాలి, మా సంక్షేమం కోసం పెద్దమనసుతో అలోచించి ఒక ఆమోదయోగ్యమైన , ఆచరణాత్మకైన ప్రకటన చేసి భరోసా కల్పించాలని లేదంటే గల్ఫ్ గళాన్ని వినిపించి  ఏ రాజకీయ పార్టీ గల్ఫ్ సంక్షేమం కోసం సుస్పష్టమైన విధానాన్ని అవలంబిస్తే ఆ పార్టీకే మా మద్దతు ఉంటుందని తెలుపడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ETCA వ్యవస్థాపకులు కిరణ్ కుమార్ పీచర, సత్యనారాయణ గాంధారి, లింగరెడ్డి పడాల, షేక్ మోహమ్మద్ షాదుల్లా, శ్రీనివాస్ రావ్ సంకినేనె, చంద్ర తోట, బాలు క్యాతి సిరిసిల్ల, రమణా చారి, అన్నారం కనకయ్య మరియు ఖతార్ తెలంగాణ సమితి అధ్యక్షుడు గుగ్గిల్ల రవి గౌడ్, బాబుస్వామి భాస్కర్ నర్వేట్ల, ప్రభాకర్ కొక్కుల, డైరెక్టర్ ఉళి కళాకారులు ఆకునూరి దేవన్న, అష్ట గంగాధర్, డప్పు రమేష్, గుర్రపు రాము, దుబాయ్, సౌదీ అరేబియా,బహ్రెయిన్, ఒమన్ వంటి  గల్ఫ్ దేశాల నుండే కాక సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా  వంటి వివిధ దేశాల నుండి సెలవులపై ఇంటికి వచ్చిన బిడ్డలంతా గల్ఫ్ గళం సమావేశానికి హాజరై తమ సంఘీభావాన్ని తెలిపారు.

Back to Top