గణేష్ ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ భద్రత

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ భద్రత

హైదరాబాద్:గణేష్ ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి 14వేల మందిని మంటపాల వద్ద సెక్యూరిటీ కోసం వినియోగిస్తున్నారు. ప్రతి చోట విగ్రహాల ప్రతిష్టాపనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ముందస్తుగానే చేస్తున్నందున.. అక్కడ పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకూ 8వేల మంటపాల్లో విగ్రహాలు కొలువుదీరాయి. అటు, రాత్రి సమయాల్లో ప్రతి మంటపం వద్ద కనీసం ఇద్దరు ఉండి ఏర్పాట్లు, భద్రత చూసుకునేలా ప్లాన్ చేశారు. ఉత్సవాలు ముగిసాక ఆఖరు రోజున నిమజ్జనం సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఇప్పటి నుంచే సెక్యూరిటీ పటిష్టం చేశారు. బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకూ 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ర్యాలీ సాగే 18 కిలోమీటర్ల పొడవునా భారీగా బలగాలను మోహరిస్తున్నారు.

Back to Top