అసత్య వార్తలు, ఫేక్ వీడియోలకు కళ్లెం వేయడానికి ఫేస్‌బుక్ మరో అడుగు.!
- September 15, 2018
అసత్య వార్తలు, ఫేక్ వీడియోలకు కళ్లెం వేయడానికి ఫేస్‌బుక్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. తమ సైట్‌లో ప్రచారం అవుతున్న వార్తల నిజ నిర్ధారణ చేసుకునే సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటోంది. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా థర్డ్ పార్టీ విశ్లేషకుల సాయం తీసుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. యూజర్లు పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలను పరీక్షించనున్నట్లు పేర్కొంది. 'అసత్య ప్రచారాన్ని గుర్తించేందుకు మేము ఫేస్‌బుక్‌లో ఇప్పటికే మెషీన్ లెర్నింగ్ మోడల్‌ను అభివృద్ధి చేశాం. దాని ద్వారా యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. ఎవరైనా యూజర్.. ఫేస్‌బుక్‌లో అసత్య ప్రచారాన్ని గుర్తిస్తే దాని గురించి మాకు రిపోర్టు చేయొచ్చు. దాన్ని మా బృందం పరిశీలించి, ఆ ఫొటో, వీడియో, వార్తల్లో నిజం ఎంతో తెలుసుకుంటుంది' అని ఫేస్‌బుక్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఫొటోలు, వీడియోల వల్ల ప్రచారం అయ్యే తప్పుడు సమాచారం మూడు విధాలుగా ఉంటుందని ఫేస్‌బుక్ పేర్కొంది. ఫొటోలు, వీడియోల్లో మార్పులు చేయడం, తప్పుడు సమాచారాన్ని రాసి వాటిని పోస్టు చేయడం, ఆడియోలో తప్పుడు విషయాలను చెప్పడం ద్వారా ఇటువంటివి ప్రచారం చేస్తారని తెలిపింది. అటువంటి వాటిని అరికట్టడానికి తమ సంస్థ ప్రయత్నిస్తుందని చెప్పింది. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ (ఓసీఆర్) అనే టూల్ ద్వారా ఫొటోలలోని టెక్స్ట్‌ను గ్రహించి, అందులో నిజం ఎంత? అనే విషయాన్ని తమ బృందం గుర్తిస్తుందని తెలిపింది. ఫొటోలు, వీడియోల్లో మార్పులు చేసి పోస్టులు చేస్తే ఈ విషయాలను గుర్తించడానికి ఇప్పుడు కొత్త పద్ధతులను అవలంభిస్తున్నామని చెప్పింది.
ఫేస్‌బుక్‌లో కొందరు పోస్ట్ చేస్తున్న ఆర్టికల్స్ విషయంపై కూడా తాము దృష్టి పెట్టామని తెలిపింది. తప్పుడు శీర్షికలతో కొందరు ఆర్టికల్స్‌ను పోస్ట్ చేస్తున్నారని, కొందరు యూజర్లు వాటిని షేర్ చేస్తున్నారని, దీంతో తమ వెబ్‌సైట్‌లో దాన్ని క్లిక్ చేసిన యూజర్.. మరో వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడ ఆ శీర్షికకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో ఆశ్చర్యపోతున్నాడని ఫేస్‌బుక్ పేర్కొంది. అమెరికా నుంచి ఇటువంటి ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని తెలిపింది. థర్డ్ పార్టీ విశ్లేషకులకు ఇటువంటి అసత్య ప్రచారాలను గుర్తించి పంపుతామని, వారు ఆ ప్రచారంలో నిజం ఎంత ఉందని గుర్తించి రేటింగ్స్ కూడా ఇస్తారని తెలిపింది. దీంతో తమ మెషీన్ లెర్నింగ్ మోడల్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







