నాని డాన్స్ విత్ దేవదాస్ చాలెంజ్.!
- September 15, 2018
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం కింగ్ నాగార్జున తో కలిసి దేవదాస్ చిత్రం తో రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్లో వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. ఇక సినిమా విడుదల దగ్గర పడుతుండడం తో చిత్ర ప్రమోషన్లను స్పీడ్ చేసారు. తాజాగా వినాయకచవితి సందర్బంగా విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇప్పుడు మూవీలోని వినాయక చవితి స్పెషల్ సాంగ్ డ్యాన్స్‌తో చాలెంజ్ విసిరింది చిత్ర యూనిట్. మేం రెడీ.. మీరు రెడీనా అంటూ వీడియో సాంగ్ ప్రొమోను నాని ట్వీట్ చేసాడు. 'వినాయక చవితి వేడుకల్లో భాగంగా మీరు డ్యాన్స్ చేసి వీడియోలను షేర్ చేయండి. ఆ వీడియోను డ్యాన్స్‌విత్‌దేవదాస్ (DanceWithDevadas)కు ట్యాగ్ చేసిన వాళ్లలో కొందరికి దేవదాస్ మూవీ యూనిట్ నుంచి బహుమతులు వస్తాయని' వైజయంతీ మూవీస్ ట్విటర్‌లో పోస్ట్ చేసారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ మంచి డాన్స్ వీడియో ను సెండ్ చేసి బహుమతులు గెలుచుకోండి.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







