ఒమన్‌లో పలు ప్రాంతాలకు వాటర్‌ సప్లయ్‌ కట్‌

- September 15, 2018 , by Maagulf
ఒమన్‌లో పలు ప్రాంతాలకు వాటర్‌ సప్లయ్‌ కట్‌

మస్కట్‌: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ ఎలక్ట్రిసిటీ అండ్‌ వాటర్‌ (డియామ్‌), నార్తరన్‌ షర్కియాలోని విలాయత్‌ అల్‌ కాబిల్‌ పంపింగ్‌ స్టేషన్‌లో మెయిన్‌టెనెన్స్‌ వర్క్‌ ప్రారంభించింది. ఈ కారణంగా, అల్‌ కాబిల్‌, ఇబ్రా మరియు అల్‌ ముదైబిలో వాటర్‌ సప్లయ్‌కి అంతరాయం కలిగింది. నార్త్‌ షర్కియా ఆపరేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ ఇంజనీర్‌ ఇబ్రహీమ్‌ అల్‌ నోజ్వాని మాట్లాడుతూ, వాటర్‌ ఫ్లో ఆపరేషన్స్‌ కోసం భారీ పంప్స్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పనుల కారణంగా వాటర్‌ సప్లయ్‌ని నిలిపివేసినట్లు తెలిపారాయన. వాటర్‌ పిల్లింగ్‌ స్టేషన్స్‌ నెట్‌వర్క్‌కి కూడా అంతరాయం ఏర్పడింది. 48 గంటల పాటు.. అంటే ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఇబ్బందులు కొనసాగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com