నాసా బంపర్ ఆఫర్.. పడుకుంటే 11 లక్షలు.!
- September 15, 2018
కదలకుండా జస్ట్ పడుకోవాలంతే... మీకు 11 లక్షలు వచ్చి చేరుతాయి. ఇదేంటి పడుకుంటేనే 11 లక్షలు ఇస్తారా... ఇంతటి ఆఫర్ ఎవరిస్తున్నారనేగా మీ డౌటు... అవునండీ ఇది నిజం. నాసా చేస్తున్న సరికొత్త ప్రయోగం కోసం ఈ భారీ ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం రిక్రూట్‌మెంట్ కూడా ప్రారంభించింది. ఏ కిటుకు లేకుండా ఉత్త పుణ్యానికి అంత భారీ మొత్తం చెల్లించేందుకు అది మామూలు కంపెనీ కాదు... అంతరిక్ష పరిశోధనలు చేసే నాసా సంస్థ. పడుకోవడమంటే ఒకరోజు రెండు రోజులు కాదు 70 రోజులు పడుకోవాలి. ఏంటి చిన్న సైజు బిగ్‌బాస్ షో గుర్తుకొస్తోందా.. మరి అంత డబ్బు ఇస్తున్నప్పుడు ఈ కొంచెం పని చేయక తప్పదు.
ఒక మనిషి అంతరిక్షంలో ఉంటే తన బరువుపై ప్రయోగం చేసేందుకు నాసా పూనుకుంది. ఇందుకోసం ఒక సెటప్ ఏర్పాటు చేసింది. బెడ్‌రెస్ట్ స్టడీ పేరుతో ఇప్పటికే అభ్యర్థులను నాసా నియమించుకుంటోంది. ఇక ఇక్కడ జాబ్ ఏమిటంటే నిద్రపోవడమే.. అంటే పడుకొనే తినాలి, పడుకొనే స్నానాలు చేయాలి... అప్పుడు మానవుని గుండె రక్తనాళాల వ్యవస్థ ఎలాగుంటుందో పరీక్షిస్తారు. దీని ద్వారా అంతరిక్షంలో మానవుని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు శాస్త్రవేత్తలు.
ఇలాంటి ఆఫరే 2013లో నెదర్లాండ్స్ రాజధాని హెల్సిన్కీలో హోటల్ ఫిన్ యాజమాన్యం ఇదే తరహా పరీక్షల కోసం మనుషులను నియమించుకుంది. తమ హోటల్‌లోని బెడ్లను పరీక్షించి తద్వారా తమ కస్టమర్లు తమ నుంచి ఎలాంటి కంఫర్ట్ కోరుతున్నారో అంచనావేశారు. పడుకున్న వారికి భారీగానే డబ్బులు చెల్లించింది యాజమాన్యం. ఇప్పుడు చెప్పండి హాయిగా నిద్రపోయే ఉద్యోగం ఇచ్చి జీతం ఇస్తామంటే ఎవరైతే అప్లై చేసుకోరు చెప్పండి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి