త్వరలో మొదలుకానున్న వెంకీ- త్రివిక్రమ్ ల సినిమా.!
- September 15, 2018
వినోదాన్ని పండించడంలో ఆరితేరిన వెంకీ.. కామెడీ ఎంటర్టైనర్స్ తీయడంలో దిట్ట అయిన త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కబోతోంది. విశేషం ఏమంటే.. ఇది త్రివిక్రమ్ పవన్ కోసం రాసుకున్న కథట! ప్రస్తుతం మల్టీస్టారర్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న వెంకటేశ్.. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయిన విషయం తెలిసిందే. గత డిసెంబర్ లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. 'అరవింద సమేత' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఓ పక్క జరుగుతుండగానే ఇటీవల వెంకీని కలిసిన త్రివిక్రమ్ ఓ కథ చెప్పాడట. గతంలో పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ రాసుకున్న కథనే వెంకీకి వినిపించినట్టు తెలుస్తోంది. నిజానికి 'అజ్ఞాతవాసి' చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమా తెరకెక్కాల్సింది. కానీ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంవల్ల ఈ సినిమా కార్యరూపం దాల్చలేకపోయింది. ఇప్పుడు అదే కథతో త్రివిక్రమ్ వెంకీని ఇంప్రెస్ చేశాడని వినికిడి.
గతంలో వెంకటేశ్ నటించిన ''నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, వాసు'' చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు అందించాడు. అందులో మొదటి రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. త్రివిక్రమ్ దర్శకుడి అవతారం ఎత్తినప్పటి నుండీ ఆయనతో వెంకటేశ్ సినిమా చేస్తే బాగుంటుందని ఎంతోమంది అనుకుంటూ ఉన్నారు. ఆ కోరిక ఇంత కాలానికి నెరవేరబోతోంది. 'అరవింద సమేత' చిత్రం విడుదల కాగానే త్రివిక్రమ్.. వెంకీ సినిమానే టేకప్ చేస్తారని తెలుస్తోంది. దీనిని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అయితే మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునే వెంకీ నోట మళ్లీ త్రివిక్రమ్ మాటల్ని వినాలంటే వచ్చే సంవత్సరం వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







