రూపాయి దెబ్బకు భారత దేశ ఫారెక్స్ నిల్వలు అడుగంటాయా?
- September 15, 2018
విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు సెప్టెంబరు 7తో ముగిసిన వారానికి 819.5 మిలియన్ డాలర్లు తగ్గి 399.28 బి.డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్బీఐ వెల్లడించింది. ఒక ఏడాదికిపైగా కాలంలో 400 బి.డాలర్ల దిగువకు విదేశీ మారకపు నిల్వలు పడిపోవడం ఇదే తొలిసారని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగా ఇటీవల ఆర్బీఐ డాలర్లను విక్రయిస్తూ రావడంతో నిల్వలు తగ్గాయి. సెప్టెంబరు 7తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 887.4 మి.డాలర్లు తగ్గి 375.09 బి.డాలర్లకు పరిమితమయ్యాయి. పసిడి నిల్వలు 71.9 మి.డాలర్లు పెరిగి 20.23 బి.డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వద్ద SDRలు 1.5 మి.డాలర్లు తగ్గి 1.47 బి.డాలర్లకు, నిల్వలు 2.5 మి.డాలర్లు తగ్గి 2.47 బి.డాలర్లకు పరిమితమయ్యాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







