చైనాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన
- September 16, 2018
చైనా:తెలుగువారు ఏ రాష్ట్రంలో ఉన్నా.. తెలుగు రాష్ట్రాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. చైనా పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ బీజింగ్ చైనా తెలుగు అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. చైనాలో ఉంటున్న తెలుగువారంతా ఏపీకి ప్రచారకర్తలుగా మారి.. మీరు పనిచేస్తున్న కంపెనీల్లో రాష్ట్రం గురించి చెబితే రాష్ట్రానికి పరిశమల రాక పెరుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికోసం చైనాలో ఉన్న తెలుగువారంతా కృషి చేయాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నారని.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత చుట్టుముట్టిన సమస్యల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో చాకచక్యంగా అధిగమించి అభివృద్ధివైపు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. దేశంలో చాలామంది నదుల అనుసంధానం గురించి మాట్లాడారు.. కానీ చంద్రబాబు మాత్రమే దాన్ని చేసి చూపారని వివరించారు. పట్టిసీమ ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తి చేశామని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు.
రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లడం వల్లే అనంతపురం జిల్లాకు కియా కార్ల కంపెనీ వచ్చిందని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనా అందరి కంటే ముందుందని... చైనాని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఏపీలో 240 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేశ్ వివరించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







