దుబాయ్ లో 'సైమా' సందడి...
- September 16, 2018
దుబాయ్:తెలుగు సినీ స్టార్స్ అంతా ఒకే చోట మెరిస్తే...ఆ ఆనందానికి హద్దులండవు. అలాంటిది దక్షిణ భారత దేశ తారాలోకం అంతా ఒకేచోట ప్రత్యక్షం అయితే...అక్కడ ఉండే సందడే వేరు. రెండు రోజులుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తారలతో కోలాహలంగా మారింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఏడో ఎడిషన్ కార్యక్రమం అక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండు రోజుల వేడుకల్లో భాగంగా మొదటి రోజు మలయాళం, తమిళం భాషల్లో చిత్రాలకు వివిధ విభాగాల్లో 'సైమా' పురస్కారాలను అందించారు. రెండో రోజు శనివారం రాత్రి తెలుగు, కన్నడ స్టార్స్ అవార్డులు అందుకున్నారు. ముగింపు రోజున ప్రగ్యాజైశ్వాల్, ప్రణిత బృందాలు తమ నృత్యాలతో ఆహూతులను అలరించాయి. రాధిక శరత్‌కుమార్, భూమిక, భరత్ ఠాకూర్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, సింగర్ మధు ప్రియ మంగి శ్రీకాంత్ దంపతులు హాజరై ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ అవార్డుల్లో తెలుగు చిత్రసీమ నుంచి ఉత్తమ నటుడిగా 'బహుబలి'లో తన నటనకు ప్రభాస్‌కు అవార్డు వరించింది. ఉత్తమ నటుడు క్రిటిక్ పురస్కారాన్ని బాలకృష్ణ అందుకున్నారు. ఉత్తమ నటిగా కాజల్ అగర్వాల్ (నేనే రాజు నేనే మంత్రి) నిలిచింది.
ఉత్తమ చిత్రంగా బాహుబలి, ఉత్తమ దర్శకుడిగా ఎస్‌ఎస్ రాజమౌళి(బాహుబలి) అవార్డులను అందుకున్నారు.ఈ కార్యక్రమాన్ని దుబాయ్ లో అంజన్ స్టార్ ఈవెంట్స్ సంస్థ లోకల్ ఈవెంట్ పార్టనర్గా వ్యవహరించింది.







తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







