సెర్బియాతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న ఇండియా
- September 16, 2018
సెర్బియా:ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సెర్బియా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా సెర్బియా అధ్యక్షుడు మరియు భారత ఉపరాష్ట్రపతి సమక్షంలో ఇరుదేశాలు రెండు ప్రధాన ఒప్పందాల మీద సంతకాలు చేశాయి. ఇందులో మొదటి ఒప్పందం పంటల సంరక్షణ, పండ్లు, కూరగాయలు, ప్రాసెస్ ఫుడ్స్ మీద కాగా రెండో ఒప్పందం ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ప్రసారాలు, వాణిజ్యం, పర్యాటక రంగాల అభివృద్ధికి సంబంధించింది.
సెర్బియా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సెర్బియాతో పాటు మాల్టా మరియు రొమానియాలను సందర్శించి శుక్రవారం భారత్ చేరుకోనున్నారు. ఇది ఉపరాష్ట్రపతికి రెండో విదేశీ పర్యటన. మొదటి విదేశీ పర్యటనలో లాటిన్ అమెరికా దేశాలైన గ్వాటెమాల, పనామా మరియు పెరూ దేశాలను సందర్శించి పలు ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







