'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' లోని అమితాబ్ ఫస్ట్ లుక్
- September 18, 201870 ఏళ్లు పైబడ్డాక కూడా అలుపెరగకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు అమితాబ్ బచ్చన్. ఐతే ఏదో మొక్కుబడిగా సినిమాలు చేయడం కాదు.. చాలా విలక్షణమైన పాత్రలతో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం అమితాబ్.. అమీర్ ఖాన్ తో కలిసి నటిస్తున్న 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'పై ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే.
ఈ సినిమాలో అమితాబ్ పాత్ర గురించి ముందు నుంచే బాలీవుడ్ జనాలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ అంచనాలకు తగ్గట్లే ఈ రోజు రిలీజ్ చేసిన బిగ్-బి పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో అమితాబ్ ఖుదాబక్ష్ అనే పాత్ర చేస్తున్నాడు. ఈ చిత్రం సముద్రపు దొంగల నేపథ్యంలో సాగుతుంది. దాన్ని సూచిస్తూ ఒక భారీ ఓడను నడిపించే కెప్టెన్ గా అమితాబ్ కనిపించాడు. ఆయన లుక్ లో రాజసం కనిపిస్తోంది. లుక్ తో పాటు కాస్ట్యూమ్స్ అదిరిపోయాయి.
మామూలుగానే అమీర్ సినిమాలంటే ప్రత్యేకం అన్న భావన ఉంటుంది. ఇక అతను తొలిసారి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. 'ధూమ్' సిరీస్ లో తొలి రెండు చిత్రాలకు రచన చేసి... 'ధూమ్-3' దర్శకుడిగా మారిన విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
దీపావళి కానుకగా 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'ను ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఒక నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. సముద్రంలో దొంగతనాల నేపథ్యంలో చాలా థ్రిల్లింగ్ ఈ చిత్రం సాగుతుందట. దీని కోసం అమీర్ ఖాన్ పూర్తిగా అవతారం మార్చేశాడు. సన్నబడ్డాడు. జుట్టు పెంచాడు. ముక్కుకు.. చెవులకు కమ్మలతో చిత్రంగా కనిపించబోతున్నాడు. కత్రినా కైఫ్ ఇందులో అతడికి జోడీగా నటిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?