తెలంగాణ జిల్లాల్లో 20 ఐటీ సంస్థలు..
- December 18, 2015
భాగ్యనగరికి పరిమితమైన ఐటీ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం జిల్లాలకూ విస్తరిస్తోంది. దీనికోసం నూతన ఐటీ విధాన ముసాయిదాను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మంలో మినీ ఐటీ హబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ హబ్‌లలో కార్యాలయాలను నెలకొల్పే కంపెనీలకు ప్రోత్సాహకాలతోపాటు అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారం తెలిపారు. హైసియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ హబ్‌లలో మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. 'డేటా అనలిటిక్స్ రంగ కంపెనీలకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు అనువైనవి. తక్కువ ఖర్చుతో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని స్థాయిల వరకు సాధారణ నైపుణ్యం ఉన్న ఉద్యోగులు సరిపోతారు' అని అన్నారు. నూతన ఐటీ పాలసీని జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ప్రకటిస్తామన్నారు. మరో 20 ఐటీ సంస్థలు.. హైదరాబాద్‌లో కార్యాలయాలను స్థాపించేం దుకు దేశ, విదేశాలకు చెందిన 20 కంపెనీల దాకా ఆసక్తిగా ఉన్నాయని జయేశ్ తెలిపారు. ఏడాదిలో ఇవి ఏర్పాటు అవుతాయన్నారు. ఈ కంపెనీలే తమ ప్రణాళికను త్వరలో వెల్లడిస్తాయని, చర్చలు పురోగతి దశలో ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న ప్రతిపాదిత భారీ క్యాంపస్ కోసం గూగుల్‌కు స్థలం బదలాయించామని చెప్పారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఈ క్యాంపస్ కోసం భూమి పూజ జరిగే అవకాశం ఉందన్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకలు..: సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎం టర్ప్రైసెస్ అసోసియేషన్(హైసియా) 15 మంది సభ్యులతో 1991లో ప్రారంభమైంది. రాష్ట్ర జీడీపీకి హైసియా సభ్య కంపెనీలు సుమారు రూ. 70,000 కోట్లు సమకూరుస్తున్నాయని టెక్ మహీంద్రా బీపీవో సీఈవో విజయ్ రంగినేని తెలి పారు. ప్రత్యక్షంగా 4 లక్షలు, పరోక్షంగా 10 లక్షల మంది ఐటీ రంగంలో ఉపాధి పొందుతున్నారని చెప్పారు. 4 లక్షల మందిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 60% ఉంటారని హైసియా ప్రెసిడెంట్ రమేశ్ లోగనాథన్ పేర్కొన్నారు. భారత్‌పై తీవ్ర ప్రభావం.. యూఎస్ ప్రభుత్వం హెచ్1బీ, ఎల్1 వీసా ఫీజుల పెంపు ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంటుందని సైయంట్ ఫౌండర్, నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి అన్నా రు. 'భారత ఐటీ కంపెనీలతో యూ ఎస్ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రయోజనం కలిగింది. ఇక్కడి కంపెనీలను ఇబ్బందులకు గురిచేసే చర్యలు అంత శ్రేయస్కరం కాదు. యూఎస్‌లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో నిపుణుల కొరత ఇంకా ఉంది' అని చెప్పారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









