లేత కొబ్బరి జీడిపప్పు సక్కీ
- September 26, 2018కావలసినవి: లేత కొబ్బరి 100 గ్రా., నూనె 30 మి.లీ., తరిగిన ఉల్లిపాయ 50 గ్రా., తరిగిన చిన్నసైజు టొమాటో ఒకటి, కారం ఒక టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, గరం మసాలా అర టీ స్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద అర టీ స్పూను, నానబెట్టిన జీడిపప్పులు 15, ఉప్పు తగినంత, ఒకటిన్నర టేబుల్ స్పూను టొమాటో కెచప్, ఒక కప నీళ్లు, తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూను.
ఎలా చేయాలి: కొబ్బరిని సన్నని పొడవైన ముక్కలుగా తరగాలి. బాణలిలో నూనె వేసి మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు కలపాలి. కొబ్బరి ముక్కలు వేసి రెండు నిముషాల పాటు ఉడికించాలి. కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి ముద్దను వేసి బాగా కలపాలి. జీడిపపలు, ఉప్పు, టొమాటో కెచప్‌లు వేసి కలపాలి. నీళ్లు పోసి సన్నని సెగ మీద ఉడికించాలి. ఆ తర్వాత కిందికి దించి కొత్తిమీరతో అలంకరించాలి. ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్‌ను కలిసిన భారత రాయబారి
- ఖతార్‌లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు