లేత కొబ్బరి జీడిపప్పు సక్కీ
- September 26, 2018
కావలసినవి: లేత కొబ్బరి 100 గ్రా., నూనె 30 మి.లీ., తరిగిన ఉల్లిపాయ 50 గ్రా., తరిగిన చిన్నసైజు టొమాటో ఒకటి, కారం ఒక టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, గరం మసాలా అర టీ స్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద అర టీ స్పూను, నానబెట్టిన జీడిపప్పులు 15, ఉప్పు తగినంత, ఒకటిన్నర టేబుల్ స్పూను టొమాటో కెచప్, ఒక కప నీళ్లు, తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూను.
ఎలా చేయాలి: కొబ్బరిని సన్నని పొడవైన ముక్కలుగా తరగాలి. బాణలిలో నూనె వేసి మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు కలపాలి. కొబ్బరి ముక్కలు వేసి రెండు నిముషాల పాటు ఉడికించాలి. కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి ముద్దను వేసి బాగా కలపాలి. జీడిపపలు, ఉప్పు, టొమాటో కెచప్‌లు వేసి కలపాలి. నీళ్లు పోసి సన్నని సెగ మీద ఉడికించాలి. ఆ తర్వాత కిందికి దించి కొత్తిమీరతో అలంకరించాలి. ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!