60 గెటప్స్‌లో బాలకృష్ణ
- September 26, 2018నందమూరి తారక రామారావు జీవిత కథతో బాలయ్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ క్రేజీ మూవీని బాలకృష్ణతో కలసి సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కెరీర్లో ఇదే హై బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ బయోపిక్ వచ్చే సంక్రాంతికి విడుదలకాబోతుంది.
ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య 60 గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ విధ్యాబాలన్ కీ రోల్ పోషిస్తోంది. ఇక ఎఎన్ఆర్ గా సుమంత్ నటిస్తున్నాడు. అలాగే ఎస్.వి.ఆర్ గా నాగబాబు, చంద్రబాబు నాయుడుగా రానా, సావిత్రిగా నిత్యామీనన్, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతుంది. ఇంకా మిగిలిన పాత్రలకు ఫేమ్ ఉన్న వాళ్ళనే సెలక్ట్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ కోసం తెలుగు ప్రేక్షకులు మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైగా స్టార్స్ కూడా ఇందులో కీ రోల్ పోషిస్తుండటతో అంచనాలు మరింత పెరిగాయి. అందుకే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఆల్ రెడీ కృష్ణా, వైజాగ్, కర్ణాటక రైట్స్ ని నిర్మాతల్లో ఒకరైన సాయి కొర్రపాటి తీసుకున్నారు. ఇక నైజాం రైట్స్ ని ఎషియన్ ఫిల్మ్ అధినేత సునీల్ దక్కించుకున్నారట. మిగతా ఏరియాలకు బిజినెస్ కి కూడా ఫుల్ డిమాండ్ ఉంది. మరి ఎన్టీఆర్ బయోపిక్ ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ