స్మార్ట్ ఫోన్‌తో ప్రైవసీని దెబ్బతీస్తే 500,000 దిర్హామ్‌ల జరీమానా
- October 02, 2018
యూఏఈలో తల్లిదండ్రులు, తమ పిల్లల ప్రైవసీ, భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారు. పబ్లిక్ ఏరియాల్లో తమ పిల్లల్ని తమ అనుమతి లేకుండా స్మార్ట్ ఫోన్లలో ఫొటోలు తీయడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా చేసేవారికి 150,000 దిర్హామ్‌ల నుంచి 500,000 దిర్హామ్‌ల వరకు జరీమానా విధించే అవకాశం వుంది. అదే సమయంలో ఆరు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష కూడా విధించవచ్చని చట్టాలు చెబుతున్నాయి. అనుమతి లేకుండా వేరే వ్యక్తుల ఫొటోలు తీయడం, వీడియోలో చిత్రీకరించడం, ఫోన్ కాల్స్‌ని రికార్డ్ చేయడం నేరమని చట్టంలో స్పష్టంగా పేర్కొనబడింది. ఫెడరల్ చట్టం 5/2012 ఈ మేరకు ప్రైవసీ విషయంలో స్పష్టతనిస్తోంది. గత ఆరు నెలల్లోనే అబుదాబీ పోలీసులు ఈ చట్టం కింద 71 మంది రెసిడెంట్స్‌కి జరీమానా విధించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







