ఆసక్తి రేపుతున్న 'ది విలన్' టీజర్
- October 02, 2018
ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు పక్క రాష్ట్రాలలోను మల్టీ స్టారర్ ట్రెండ్ ఊపందుకుంది. టాప్ హీరోలు కలిసి భారీ మల్టీస్టారర్స్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరోలు శివరాజ్ కుమార్, సుదీప్ కలిసి ది విలన్ అనే చిత్రం చేస్తున్నారు. జోగి( తెలుగులో యోగి) అనే చిత్రాన్ని తెరకెక్కించిన ప్రేమ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. 2015లో కాళి అనే టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కించాలని ప్రేమ్ ప్రయత్నించిన అది సక్సెస్ కాలేదు. ఏడాదిన్నర తర్వాత ఇద్దరు హీరోలని ఒప్పించి ది విలన్ అనే టైటిల్‌తో మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్ళాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల ఒకటి విడుదల కాగా, తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మరో టీజర్ విడుదల చేశారు. దసరా శుభాకాంక్షలతో అక్టోబర్ 18న చిత్రం విడుదల కానుంది. చిత్రంలో అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ దిగ్గజం మిథున్ చక్రవర్తి, టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. భారీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







