ఒమన్‌కి భారీ వర్ష సూచన
- October 02, 2018
మస్కట్: భారీ నుంచి ఓ మోస్తరుగా వర్షాలు రానున్న వారంలో కురిసే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ ఎక్స్‌పర్ట్ అబ్దుల్లా అల్ ఖౌదోరి మాట్లాడుతూ, ఈ వారాంతంలో ట్రాపికల్ స్టార్మ్ ఏర్పడే అవకాశం వుందనీ, జరుగుతున్న వాతావరణ మార్పుల్ని గమనిస్తున్నామనీ, భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని చెప్పారు. ఇదిలా వుంటే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్, హజార్ మౌంటెయిన్స్‌లో వర్షాలు కురుస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. సుల్తానేట్‌లోని పలు ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతానికి క్లియర్ స్కై కన్పిస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో ఒమన్‌లో భారీ వర్షాలు కురిశాయి. దోఫార్ ప్రాంతానికే ఈ వర్షాలు ఎక్కువగా పరిమితమయ్యాయి. ఖరీఫ్‌కి ముందు దోఫార్‌లోని కొన్ని ప్రాంతాల్లో సైక్లోన్ మెకును కారణంగా మే వర్షాలు కురిశాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







