సోమాలియాలో ఆత్మాహుతి దాడులు, 14 మంది మృతి
- October 14, 2018
సోమాలియాలోని బైడొ నగరంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. స్థానిక బిలాన్ హోటల్, బద్రి రెస్టారెంటు లక్ష్యంగా ఇద్దరు ముష్కరులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ దాడుల్లో 14 మంది చనిపోగా .. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఆత్మాహుతి దాడులకు తామే కారణమని ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ ప్రకటన విడుదల చేసింది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక మంత్రి ఉగాస్ హాసన్ ఇబ్రహీం వెల్లడించారు.
గత మూడు దశాబ్దాలుగా హింస, అభద్రత, రాజకీయ సంక్షోభం వల్ల సోమాలియా అతలాకుతలం అవుతోంది. ఆఫ్రికన్ శాంతి పరిరక్షక దళాల సంఘాల జోక్యంతో ప్రభుత్వంలో ఏర్పడ్డ అంతర్గత విభేదాలు, వివిధ రకాల ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే సోమాలియాలో వేలాది మంది పౌరులను పొట్టనబెట్టుకున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







