480 అక్రమ వలసదారుల అరెస్ట్
- October 15, 2018
మస్కట్: లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను 480 మంది అక్రమ వలస కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. అలాగే, ఇదే కేసులో మరో 489 మందిని డిపోర్ట్ చేయడం జరిగింది. వారం రోజుల్లో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జాయింట్ ఆపరేషన్స్ ద్వారా, ఉల్లంఘనలకు పాల్పడిన వలసదారుల వీక్లీ రిపోర్ట్ ఈ గణాంకాల్ని వెల్లడించింది. అక్టోబర్ 7 నుంచి 18 మధ్య ఈ అరెస్టులు, డిపోర్టేషన్ జరిగాయి. క్యాపిటల్ అయిన మస్కట్‌లో అత్యధికంగా 118 అరెస్టులు జరగగా, దఖ్లియా గవర్నరేట్‌లో 116 మంది అరెస్ట్ అయ్యారు. అరెస్టయినవారికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్‌లోని సంబంధిత అధికార వర్గాలు, తదుపరి చర్యలను చేపట్టనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







